కలకలం రేపిన తల లేని బాలిక శవం

Posted On:24-03-2015
No.Of Views:289

గోరక్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని  గోరక్‌పూర్ రైల్వేస్టేషన్లో తలలేని బాలిక శవం  కలకలం రేపింది. చౌరీచౌరా ఎక్స్‌ప్రెస్  జనరల్ బోగీలోని అప్పర్ బెర్త్‌పై నల్లని కవర్ ఒకటి శుభ్రం చేస్తున్నవారి కంట పడింది.  దాంట్లోంచి అతిక్రూరంగా  కుక్కి పడేసిన  తల లేని బాలిక శవం బయటపడింది.   దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం  ఆసుపత్రికి తరలించారు.  కేసును త్వరలో ఛేదిస్తామని వారు తెలిపారు.