త్వరలోనే ఉద్యోగ నియామకాల ప్రక్రియ

Posted On:24-03-2015
No.Of Views:324

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామాకాల ప్రక్రియ,  అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రారంభిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు‌. తొలుత అత్యవసరమైన ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి పోస్టుల భర్తీని చేపడుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పకుండా క్రమబద్దీకరిస్తామని ఈటెల స్పష్టం చేశారు. పోస్టుల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు.