ఉత్తమ నటి కంగన రనౌత్...(62వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్)

Posted On:24-03-2015
No.Of Views:288

హైదరాబాద్: 2015 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ చిత్రం ‘క్వీన్' ఉత్తమ చిత్రంగా ఎంపికవగా, ఆ చిత్రంలో నటించిన కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికయింది. కంగనా రనౌత్ జాతీయ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి. 2008లొ ఫ్యాషన్ చిత్రానికిగాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరుగనుంది.
అవార్డుల వివరాలు
ఉత్తమ నటుడు: ‘నాను అవనుల్ల అవలు' అనే కన్నడ చిత్రానికిగాను కన్నడ నటుడు విజయ్ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.
బెస్ట్ పాపులర్ ఫిల్మ్: మేరీ కోమ్
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కోర్ట్ (మరాఠీ, హిందీ, గుజరాతి, ఇంగ్లిష్ బాషల్లో విడుదలైంది)
ఉత్తమ సహాయ నటుడు: బాబీ సింహా (తమిళ చిత్రం జిగర్తాండ)
ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: ఆశా (Jaoar Majhe)
ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (బెంగాళీ చిత్రం Chotushkone)
ఉత్తమ సహాయ నటి: బల్జిందర్ కౌర్ (హర్యానీ చిత్రం Pagdi The Honour)