దేశంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన వృద్ధురాలు మృతి

Posted On:24-03-2015
No.Of Views:242

  త్రిశూర్: దేశంలో అత్యంత పెద్ద వయసు కలిగిన మహిళ కుంజన్నం కన్ను మూశారు. ఆమె వయసు 112 సంవత్సరాలు. కేరళలోని త్రిశూర్ జిల్లా చూందుల్‌కు దగ్గరలోని పరన్నూర్‌కు చెందిన ఈమె మంగళవారం ఉదయం చనిపోయారు. భారతదేశంలో సుదీర్ఘ కాలం నుంచి నివసిస్తోన్న మహిళగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కుంజన్నం పేరు ఇటీవలే చేర్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఆరోగ్యం సరిగా లేదని, ఏమీ తినడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన వృద్ధురాలు మృతి దాంతో, నిన్ననే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇది ఇలా ఉంటే, మే 20న ఆమె 113వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. ఆమె పుట్టినరోజుని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కుంజన్నం చిన్న వయసులోనే 40 రోజుల వ్యవధిలోని ఆమె తల్లిదండ్రులను కోల్పోయారు. అప్పటి నుంచి ఆమె తన మేనల్లడు జోస్ వద్దనే ఉంటున్నారు. ఇటీవలే ఆమె శరీరంలోని కొన్ని అవయవాలు పని చేయడం పూర్తిగా మానేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు.