బాలయ్యతో పోటీ పడుతున్న మనవడు..

Posted On:24-03-2015
No.Of Views:327

హైదరాబాద్ : నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ...బుల్లి మనవడు పోటీ పడుతున్నాడు. బాలయ్య కుమార్తె బ్రాహ్మణి (మార్చి 21) ఉగాది రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నారావారి వారసుడి ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నారా బ్రాహ్మణి మంగళవారం ఉదయం తన ఫేస్ బుక్లో కొడుకు ఫోటో పోస్ట్ చేశారు.  నందమూరి అభిమానులు  ఇంకా పేరుపెట్టని బుజ్జిబాబు  ఫోటోను షేర్ చేసుకోవటంతో పాటు లైక్లు కొడుతున్నారు. ఇప్పటికే మనవడిని చూసి బాలకృష్ణ సంతోషంతో ఉన్నారు. పండగలా దిగివచ్చాడంటూ వారసుడిని చూసి మురిసిపోయారు.