ఆ స్పైసీ గాళ్స్ అంతా మళ్లీ కలుస్తున్నారు

Posted On:27-03-2015
No.Of Views:327

లాస్ ఎంజిల్స్: వారు పేరుకే అమ్మాయిలు.. కానీ స్టేజీ మీదకు వచ్చారో చెవులు చిల్లులు పడేలా కేరింతల మోతలుంటాయి. చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా హుషారుతో చిందులేయాల్సిందే. పాట అందుకున్నారంటే పరవశమవ్వక తప్పదు. వారే ఆల్ గర్ల్స్ బ్యాండ్ స్పైస్ గర్ల్స్. వచ్చే ఏడాదిలో ఒక రోజు వీరంతా ఓ చోట చేరనున్నారు. ఏదో ఒక ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలిసి పనిచేసి వీరంతా వచ్చే సంవత్సరం 20వ పునస్సంగమ వేడుకను జరుపుకోనున్నారు. స్పైసీ గర్ల్స్ అంటే ఓరకంగా బ్యాండ్ కలిగిన చీర్ లీడర్స్ లాంటివారన్నమాట. వీరికి బ్యాండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఏవైన ప్రముఖ జాతీయ లేక అంతర్జాతీయ వేడుకల్లోనే తమ అందాలను ఆరబోస్తూ దుమ్మురేపే స్టెప్పులతో, పాటలతో క్రీడాకారులను, ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించడం వీరి ఆనవాయితీ.
ఒకసారి ఒక ఈ వెంట్లో పాల్గొన్న వీరంతా మరో ఈవెంట్ వరకు కలిసే అవకాశాలు తక్కువ. అందుకోసమే వీరంతా వీలయినప్పుడల్లా ఒక ప్రత్యేక రోజును కేటాయించుకుని ఆ రోజు కలుసుకుంటారు. ఈ సందర్భంగా ది డెయిలీ స్టార్ మాజీ స్పైసీ గర్ల్ ఎమ్మా బంటన్ మాట్లాడుతూ తమ తరుపున జరిపే 20వ పునస్సంగమ వేడుక వచ్చే ఏడాది జరుపుకోనున్నామని తెలిపారు. తామంతా మరోసారి ఒకరినొకరం కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కరం ఎవరి ప్రేమల్లో వారున్నామని, ఓ ఇంటివాళ్లం కూడా అయ్యామని, గతంలో చివరిసారి 2012 ఒలింపిక్స్ గేమ్స్ వేడుకల్లో కలుసుకున్నట్లు తెలిపారు.