హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

Posted On:03-04-2015
No.Of Views:331

బ్రెజిల్: నిర్మాణంలో ఉన్న భవనంపై హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్లోని కర్పీక్యుబా పట్టణ శివారు ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని ద బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. మృతులను గుర్తించవలసి ఉందని పేర్కొంది.