వైభవంగా రైనా పెళ్లి వేడుక

Posted On:03-04-2015
No.Of Views:305

ఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని రైనా శనివారం తెల్లవారు జామున 1.12 నిమిషాలకు పరిణయమాడాడు. లీలా ప్యాలెస్‌ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ, భారత కెప్టెన్‌ ధోనీ దంపతులు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ఐసీసీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌తో పాటు టీమిండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు, సినీ, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.
మేనమామకూ అందని ఆహ్వానం: ఈ హై ప్రొఫైల్‌ వివాహానికి ఎంపికచేసిన వారికే ఆహ్వానాలు ఆందాయి. దీంతో ఈ స్టార్‌ క్రికెటర్‌ పెళ్లిని చూద్దామనుకున్న చాలా మందికి నిరాశే ఎదురైంది. ఏకంగా రైనా మేనమామ మంగోరామ్‌, ఇద్దరు మేనత్తలతో పాటు దగ్గరి బందువులకు కూడా ఆహ్వానం అందలేదట..!
మోదీ శుభాకాంక్షలు: రైనా-ప్రియాంక జంటకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.
సాయంత్రం వరకూ శిక్షణ..!
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ మొదవనున్న నేపథ్యంలో రైనా శుక్రవారం కూడా చెన్నైలో జట్టుతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రమే అతను ఢిల్లీ ఫ్లయిట్‌ ఎక్కాడట..!