స్వీయ దర్శకత్వంలో సిమ్రాన్ చిత్రాలు

Posted On:03-04-2015
No.Of Views:293

ఒకప్పుడు అగ్రనాయకిగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన నటి సిమ్రాన్. తొలి రోజుల్లో అందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన ఈ ఉత్తరాది భామ , ఆ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. అలాంటిది నటిగా క్రేజ్ ఉండగానే ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలాంటి ఆమె ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవించి, భర్త , పిల్లలతో ఒక పరిపూర్ణ స్త్రీగా మారిన సిమ్రాన్ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు.ఆమె ఇప్పుడు, కొత్తగా మరో రెండు అవతారాలు ఎత్తబోతున్నారు. అవే సినిమాకు ఆయువు పట్టు అయిన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు. సిమ్రాన్ అండ్ సన్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పిన సిమ్రాన్ పేర్కొంటూ, సినిమా ఆసక్తి తనను జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చిందన్నారు. ఇప్పుడు తన భర్త దీపక్ సాయంతో చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడానికి అదే కారణం అన్నారు.  తన ఈ ప్రయత్నానికి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహం ఉంటుందనే భావిస్తున్నట్టు సిమ్రాన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.