ఆసక్తి పెంచిన గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు

Posted On:15-05-2015
No.Of Views:298

హైదరాబాద్: ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది గూగుల్. ఇప్పటికే ఇంటర్నెట్ రంగంలో కీలకస్థానం కైవసం చేసుకున్న ఆ సంస్థ గ్యాస్ ఫెడల్, స్టీరింగ్ అవసరం లేకుండా కనీవినీ ఎరుగని రీతిలో సెల్ఫ్‌డ్రైవింగ్ కారును రూపొందిస్తోంది. అందమైన ఆకృతిలో రూపొందించిన కారు ప్రొటోటైప్ నమూనాను కాలిఫోర్నియా మౌంటెన్‌వ్యూలోని గూగుల్ క్యాంపస్‌లో ప్రదర్శించింది. ఈ వేసవిలోనే సెల్ఫ్‌డ్రైవింగ్ కారు రహదారిపై పరిగెత్తనుంది.