50.56మిలియన్ డాలర్లు పలికిన మోడ్రియాన్ పెయింటింగ్

Posted On:15-05-2015
No.Of Views:284

అమెరికాలోని న్యూయార్క్‌లో క్రిస్టీస్ వేలంలో డచ్ కళాకారుడు మోడ్రియాన్ పెయింటింగ్ 50.56 మిలియన్ డాలర్లు పలికింది. మోడ్రియాన్ పెయింటింగ్ ఇంత ధర పలకడం ఇదే ప్రథమమని వేలం సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. 1929లో వేసిన జియోమెట్రిక్ ఆయిల్ పెయింటింగ్ వేలంలో అమ్ముడుపోయింది. దీని ధర సుమారు 15 నుంచి 25 మిలియన్ డాలర్లు పలకొచ్చని అంచనా వేయగా వూహించని విధంగా 50.56 మిలియన్ డాలర్లు పలికిందని నిర్వహకులు పేర్కొన్నారు. ఈ పెయింటింగ్ ఎరుపు, నీలం, నలుపు, పసుపు రంగుల్లో చతురస్త్రాలు, దీర్ఘచతురస్రాలతో గీసిన సాధారణ పెయింటింగ్ మాదిరిగా ఉంటుంది.