కన్స్‌లో తారల తళుకులు

Posted On:15-05-2015
No.Of Views:261

 ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరుగుతున్న 68వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రెండోరోజు ఎర్రతివాచీపై పలువురు తారలు తళుక్కున మెరిశారు. 'మ్యాడ్ మ్యాక్స్- ఫ్యూరీ రోడ్' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా బాలీవుడ్ తారలు కత్రినాకైఫ్, మల్లికాషరావత్ సహా పలువురు హాలీవుడ్ తారలు ఎర్రతివాచీపై హొయలొలికించారు. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ చలనచిత్రోత్సవాలు మే 24వరకు కొనసాగనున్నాయి.