పక్షం రోజుల్లో రెండోసారి: పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు

Posted On:15-05-2015
No.Of Views:262

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భారీ పెరిగాయి. గత పక్షం రోజుల్లో వీటి ధరలు పెరగడం ఇదే రెండోసారి. ఈసారి భారీగా మోత పడింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్ పెట్రోల్‌పై ధర రూ.3.13 పెరగగా, లీటర్ డీజిల్‌పై ధర రూ.2.71 పెరిగాయి. ఇంతకు ముందు ఏప్రిల్ 30వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (బిపిసిఎల్), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్‌పిసిఎల్) ప్రతి నెలా పెట్రోల్, డిజీల్ ధరలను సవరిస్తాయి. సగటు దిగుమతి ధరను, రూపాయి - డాలర్ మారకం రేటును బట్టి చమురు సంస్థలు ఆ ధరలను సవరిస్తాయి. పెట్రోల్ ధరలు ఆగస్టు, ఫిబ్రవరి నెలల మధ్య పది సార్లు లీటర్‌కు రూ. 17.11 తగ్గాయి. డీజిల్ ధరలు అక్టోబర్, ఫిబ్రవరి నెలల మధ్య ఆరు సార్లు లీటర్‌కు రూ.12.96 తగ్గాయి. ప్రస్తుత ధరల పెంపుతో వినియోగదారులపై భారీ భారం పడనుంది.