అంజలికి మెగాస్టార్‌ సినిమాలో ఛాన్స్‌!

Posted On:15-05-2015
No.Of Views:302

మొత్తాని కోస్తా బుల్లెమ్మ అంజలి పెద్ద డైరెక్టర్‌, మెగాహీరో చేతుల్లో పడిరదని టాలీవుడ్‌లో టాక్‌. పూరితో చిరంజీవి 150 చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్‌ ఉంది. మిగతా ఇద్దరి విషయం తేల్లేదు కాని అంజలి పేరును ఒక హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఈ అమ్మడికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత సరైన బ్రేక్‌ లేదు. అడపా దడపా తెలుగు,తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ విజయం దరి చేరలేదు. వివాదాల మధ్య ఇరుక్కున్న ఈ భామ, ఇప్పుడిప్పుడే వాటిల్లోంచి బయటపడుతోంది. చిరు చిత్రంలో ఆమెను ఎంపిక చేస్తే అంజలి కేరీర్‌ గాడిలో పడ్టట్టేనని సినీవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.