1500 రూపాయలతో ముంబయికి వచ్చిన కంగనా

Posted On:16-05-2015
No.Of Views:294

28 ఏళ్ల తెల్లపిల్ల కంగనా  కేరీర్‌ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు మోడల్‌గా పలు ప్రకటనలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ముంబైకు వచ్చే టప్పుడు తాను కేవలం 1500 రూపాయలతో వచ్చానని చెప్పుకుంది. ఉన్న పళాన హీరోయిన్‌ పాత్రలు రాకపోయినా, వైవిధ్యమున్న పాత్రలు ధరిస్తూనే ఉంది. ఈ మధ్య నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును పొందాక ఆమె పరిస్థితి గాల్లో తేలినట్లే ఉంది. తెలుగులో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఇక్కడా సరైన బ్రేక్‌ రాలేదు. ఇక బాలీవుడ్‌లో అదే పరిస్థితి. వచ్చిన సినిమాల్లో తన ప్రతిభను నిరూపించుకునే పనిలో కంగనా పడిరది.