నేపాల్‌లో కొనసాగుతున్న ప్రకంపనలు

Posted On:16-05-2015
No.Of Views:246

కాఠ్‌మాండూ, కోల్‌కత, పట్నా: నేపాల్ మరోసారి వణికింది. శనివారం కూడా భూకంపలేఖినిపై 5 లోపు తీవ్రతతో పలుమార్లు భూకంపాలు, ఏడుసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. భారత్, బంగ్లాదేశ్‌ల సరిహద్దు ప్రాంతాల్లోనూ వీటి ప్రభావం కనిపించింది. మూడువారాలుగా ఆరుబయటే గడుపుతూ కంటిమీద కునుకు కరవైన నేపాల్ ప్రజలు మరింతగా భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం నుంచి శనివారం వరకు మృతి చెందినవారి సంఖ్య 136కి పెరిగింది. మన దేశంలోని పశ్చిమ్ బంగ ఉత్తర ప్రాంతం, సిక్కిం, బిహార్‌లలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. భూకంప లేఖినిపై 5.7 తీవ్రతతో ఇది నమోదయింది. భయాందోళనలతో ప్రజలు పరుగులు తీశారు. పదిన్నర సెకెన్లపాటు భూకంపం వచ్చినట్లు సిక్కింలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు. 10 కి.మీ. లోతున నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.