ఐఎస్ నాయకుడు అబు సయఫ్ హతం

Posted On:17-05-2015
No.Of Views:282

వాషింగ్టన్: ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు అబు సయఫ్‌ను అమెరికా కమాండోలు సిరియాలో హతమార్చాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశంతో అతడిని పట్టుకోవడానికి అల్ అమర్‌లో రహస్య ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అతడి భార్య ఉమ్ సయాఫ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. ఆమెను ఇరాక్‌లోని అమెరికా సైనిక కేంద్రానికి తరలించినట్లు వివరించింది. ఆమె కూడా ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొంది. అబు సయాఫ్.. ఐఎస్ దాడుల్లో పాలుపంచుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆష్టన్ కార్టర్ తెలిపారు. సంస్థ నిర్వహిస్తున్న అక్రమ చమురు, గ్యాస్, ఆర్థిక కార్యకలాపాలను కూడా పర్యవేక్షించేవాడని చెప్పారు. అతడి మృతి.. ఐఎస్‌కు మరో పెద్ద దెబ్బని తెలిపారు.