నెటిజన్ల ఆగ్రహంతో ఫేస్‌బుక్ సీఈవో దిద్దుబాటు చర్యలు

Posted On:17-05-2015
No.Of Views:277

దిల్లీ: జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ చిత్రపటాన్ని పోస్ట్ చేశారని దేశంలో అంతర్జాల వినియోగదారుల (నెటిజన్లు) నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో.. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సంబంధిత చిత్రంతో ఉన్న పోస్ట్‌ను తన పేజీ నుంచి తొలగించారు. సంస్థకు చెందిన ఇంటర్‌నెట్.వోఆర్‌జీ ఆవిష్కరణ సమయంలో మలావీలో ఆయన ఈ పోస్ట్ చేశారు. ఎంపిక చేసిన సమాచారం, సేవలను భారత్‌లో వినియోగదారులకు ఉచితంగా అందించేందుకు దీన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై భారత్‌లో వినియోగదారులు తీవ్రంగా స్పందించారు. ''మీ సదుపాయం అవసరం లేదు. భారత్ చిత్రపటాన్ని సరిచేయకపోతే ఫేస్‌బుక్‌ను ఉపయోగించడం మానేస్తాం'' అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.