రిసార్ట్‌పై దాడి.. యువతియువకులు అరెస్టు

Posted On:17-05-2015
No.Of Views:296

హైదరాబాద్: శామీర్‌పేటల్‌ని లియోనియా రిసార్ట్స్ సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది యువతులు ఉన్నారు. వీరంతా సోమాలియా, మంగోలియాకు చెందిన దేశస్థులుగా గుర్తింపు. మద్యం మత్తులో ఉన్న యువతి యువకులు తెల్లవారుజాము వరకు అర్థనగ్న నృత్యాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి వీరిని అరెస్టు చేశారు.