అనుమానాస్పదస్థితిలో టీవీ నటుడు రోనెన్ చక్రవర్తి మృతి

Posted On:17-05-2015
No.Of Views:297

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రముఖ టీవీ నటుడు రోనెన్ చక్రవర్తి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడు. తన ఇంటికి సమీపంలోని సరస్సులో ఆయన శవమై కనిపించారు. ఆయన మృతి పట్ల బెంగాలీ టీవీ పరిశ్రమతోపాటు టాలీవుడ్ కూడా తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.కాగా, శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో స్నేహితులతో కలిసి సరస్సుకు వెళ్లి గల్లంతయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.శనివారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో రోనీ మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసు అధికారులు తెలిపారు. వెంటనే అతడ్ని స్థానిక ఎంఆర్ ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.కాగా, టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రోనెన్.. బెంగాళీ బుల్లి తెరకు రోనీగా సుపరిచమయ్యారు. ప్రస్తుతం ఆయన జోల్ నూపుర్ అనే ఓ మెగా సీరియల్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా, 6 నెలల అతని కూతురుకు వచ్చే వారం అన్నప్రసాన కార్యక్రమం జరుగనుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.