అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్రం కన్నెర్ర

Posted On:17-05-2015
No.Of Views:294

ఇంటర్నెట్ సౌకర్యం పెరిగిపోవడంతో ఎక్కడ పడితే అక్కడ బూతు బొమ్మలను, నీలి చిత్రాలను నిసిగ్గుగా చూస్తూ ఉన్నవారు ఇకపై ఆ ప్రయత్నాలను మానుకోవాలి. లేదంటే వారు, వారికి ఆ సౌకర్యాన్ని కల్పించిన వెబ్ సైట్లకు బాక్సులు బద్ధలవుతాయి అంతే..! ఇది భారత ప్రభుత్వ హెచ్చరిక. భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తున్న బూతు పురాణ వెబ్ సైట్లే, దేశంలో అత్యాచార, హత్య సంఘటనలు పెట్రేగిపోవడానికి కారణమని కేంద్రం భావిస్తోంది. అందుకే వాటిపై ప్రధాని మోడీ కన్నెర చేశారు. ఆయన కనుసైగ చేయడంతో అధికారలు రంగంలోకి దిగారు.  ఇంటర్నెట్లో తామరతంపరగా పెరిగిపోతున్న అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్రం కన్నెర్రజేయడంతో, వాటి భరతం పట్టడానికి  అధికారులు సిద్ధమయ్యారు. సిద్ధమైంది. ఆయా సైట్ల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను మోదీ ఆదేశించారు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్‌ జాబితాను తయారు చేయాల్సిందిగా ఆయన కోరారు. భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇలాంటి సైట్లు దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ అంచనా వేసింది. వాటి వల్ల అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని నిరోధించాలనిన్యాయవాది కమలేశ్‌ వాస్వానీ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. కుప్పలుతెప్పలుగా ఉన్న అశ్లీల సైట్లను కట్టడి చేయాల్సిందిగా పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బూతుసైట్లను మూసేందుకు చర్యలు చేపట్టారు. 1400 అశ్లీల వెబ్‌సైట్లపై సిఐడీ అదికారులు కేసులు నమోదు చేసిన అధికారులు వీటిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్లీల వెబ్‌సైట్ల వల్ల తలెత్తుతున్న పరిణామాలను పిటిషన్‌లో వివరించారు. చిన్నారులు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువమటుకు అవే కారణమనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు