మిషన్ కాకతీయకు రూ.42 కోట్ల విరాళాలు: హరీశ్‌రావు

Posted On:19-05-2015
No.Of Views:271

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయకు ఇప్పటివరకు రూ.42 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలంగాణ భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై జలసౌధలో అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో ఖమ్మం జిల్లా మొదటిస్థానంలో ఉందని.. రెండోస్థానంలో వరంగల్, చివరిస్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉందన్నారు. మిషన్ కాకతీయ కీలకదశకు చేరుకుందని.. టెండర్ల జారీ, బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.