24న పదో తరగతి విద్యార్థులకు ‘టైమ్స్‌’ స్కాలర్‌షిప్‌ టాలెంట్‌ టెస్ట్‌

Posted On:19-05-2015
No.Of Views:261

సైదాబాద్‌: పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు, స్కాలర్‌షిప్‌లు అందించేందుకు టైమ్స్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యలో 24 టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి మహ్మద్‌ జహంగీర్‌ షరీఫ్‌ తెలిపారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టులలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మొదటి ర్యాంకు సాధిస్తే లక్ష నగదు బహుమతి, రెండో ర్యాంకుకు రూ.80వేలు, మూడో ర్యాంకుకు రూ.70 వేలు, నాలుగో ర్యాంకుకురూ.60 వేలు, ఐదో ర్యాంకుకు రూ.50వేలు, ఆరో ర్యాంకుకు రూ.40 వేలు, 7వ ర్యాంకుకు రూ.30వేలు, 8వ ర్యాంకుకు రూ.20వేలు, 9వర్యాంకుకు రూ.15వేలు, 10వ ర్యాంకుకు రూ.10వేలు నగదు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.అంతేగాకుండా 11 నుంచి వంద ర్యాంకుల వరకు కూడా నగదు బహుమతులు ఉంటాయని ఆయన చెప్పారు. టాలెంట్‌ టెస్ట్‌ ఫలితాలు 27న ప్రకటిస్తామని, బహుమతుల ప్రదానం 31న ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసి వారిని పోత్సహించి ఆర్థికంగా ఆదుకునేందుకు టాలెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మిగతా వివరాలకు సంతోష్‌నగర్‌లోని తమ కార్యాలయ ఫోన్‌ నెంబర్లు 040-24534720, 9297150032, 8121894720 సంప్రందించాలని ఆయన కోరారు.