భార్యకు నిద్రమాత్రలిచ్చి విలాసాలు

Posted On:19-05-2015
No.Of Views:381

 వివాహేతర సంబంధాల గురించి భార్యకు తెలియవద్దనుకున్నాడు...ఈ విషయాన్ని దాచి ఉంచేందుకు ఆమెకు రోజూ నిద్రమాత్రలు ఇస్తుండే వాడు. చివరకు అతడే అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో నివసించే ఎండి సాదిక్‌(68) ఆర్కిటెక్ట్‌. మొదటి భార్యతో వివాదం తలెత్తడంతో విడాకులు ఇచ్చాడు. 2013లో పాతబస్తీకి చెందిన నస్రీన్‌ మల్లికను వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తరువాత భార్య ముందే పరాయి స్త్రీ ఇంటికి తీసుకువచ్చి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మల్లిక పలు మార్లు ఎదిరించింది. చచ్చిపోతా అంటు సాదిక్‌ బెదిరించాడు. తన గుట్టు ఎక్కడ భయటపెడుతుందోనని మంచినీరు, తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి మల్లికకు ఇచ్చేవాడు. ఆమె మత్తులో ఉండగా ఇంట్లో విలాసాలు చేసుకునేవాడు. సోమవారం అర్ధరాత్రి కూడా భార్యకు మత్తు ఇచ్చి పరస్త్రీని తీసుకొచ్చాడు. మెలకువ వచ్చిన మల్లిక ఎలాగైనా భర్త బండారం బయటపెట్టాలని నిశ్చయించుకుంది. పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నించగా అడ్డుతగిలాడు. మల్లిక అతడిని ఓ గదిలో బంధించి బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్లి గది తెరిచి చూడగా సాదిక్‌ కుప్పకూలిపోయి ఉన్నాడు. పరీక్షంచగా మరణించినట్టు నిర్ధారణ అయింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.