వైభవంగా మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహం

Posted On:20-05-2015
No.Of Views:251

హైదరాబాద్: సినీనటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఎంపీ సుబ్బరామిరెడ్డి, వైకాపానేత జగన్, సినీ దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, సినీ నటులు బాలకృష్ణ, రజనీకాంత్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, సూర్య, ప్రభాస్ తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.