ఆస్పత్రిలో లంచం... అంబులెన్స్‌లో ప్రసవం

Posted On:20-05-2015
No.Of Views:278

 హైదరాబాద్: ఓ మహిళ అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళుతూ.. ఆ అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్‌లోని జన్‌సత్ పట్టణానికి చెందిన అమీర్ అనే వ్యక్తి పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తీసుకువెళ్లాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించుకునేందుకు ఆస్పత్రి సిబ్బంది లంచం ఇవ్వమని డిమాండ్ చేశారు. దీంతో అమీర్ భార్యను వేరే ఆస్పత్రికి తీసుకువెళుతుండగా ఆమె అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది లంచం కోరడం పట్ల మహిళ కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై విచారణ చేపడతామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శరణ్‌వీర్ సింగ్ తెలిపారు.