అంబానీ కారు రిజిస్ట్రేషన్‌కి రూ.1.6 కోట్లు!

Posted On:20-05-2015
No.Of Views:254

 హైదరాబాద్: ఒక కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్అంబాని ఏకంగా రూ.1.6 కోట్లు ఖర్చుపెట్టారు. ఆయన ఇటీవల బీఎండబ్ల్యూ 7 సిరీస్ వాహనాన్ని కొనుగోలు చేశారు. బులెట్‌ప్రూఫ్ వాహనమిది. కారు ఖరీదు రూ. 8.5 కోట్లుకాగా, అంబానీ ఆ కారు రిజిస్ట్రేషన్‌కి రూ.1.6 కోట్లు వెచ్చించారు. ఈ కారును ఆయన ప్రత్యేకంగా జర్మనీలో తయారుచేయించారట! అందుకే నియమాల ప్రకారం 20 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశామని అధికారులు తెలిపారు.