నిప్పుల కుంపటి

Posted On:20-05-2015
No.Of Views:277

హైదరాబాద్: భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా... ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గన్నవరం, నందిగామలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. నెల్లూరు, కావలిలో 43, ఒంగోలు, కర్నూలులో 42, తిరుపతిలో 41, తునిలో 40, బాపట్ల, మచిలీపట్నం, అనంతపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య దిశగా వీస్తున్న ఉష్ణగాలుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.