డ్రెస్సా... గడ్డి దుబ్బా... సోనమ్‌కపూర్ దుస్తులపై విమర్శల వెల్లువ

Posted On:20-05-2015
No.Of Views:317

 హైదరాబాద్: ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకల్లో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ధరించిన దుస్తులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 29 ఏళ్ల సోనమ్ ఈసారి ఎలీ సాబ్ డిజైన్ చేసిన గౌను ధరించింది. సాధారణంగానే సోనమ్ మిగతావారితో పోలిస్తే కొంచెం 'బోల్డ్'గా ఉండే దుస్తులే ధరిస్తూ వచ్చిందిప్పటివరకూ. ఈసారి మాత్రం సోనమ్ ధరించిన డ్రస్ అభిమానులను నిరాశపరిచింది. అది డ్రెస్సా... కార్న్ ఫ్లేక్సా... గడ్డి దుబ్బులా ఉంది, పేర్చిన బ్రెడ్ ముక్కల్లా ఉంది, బొచ్చు కుక్కపిల్లలా ఉందని.... అభిమానులు ట్విట్టర్ వేదికగా రకరకాల వ్యాఖ్యలు చేశారు.