కొడుకుకోసం.. పెళ్లికొడుకును వెతుకుతున్న తల్లి!

Posted On:20-05-2015
No.Of Views:361

 హైదరాబాద్: ప్రపంచంలో ఏ తల్లి అయినా తన కొడుకు మంచి అమ్మాయిని పెళ్లిచేసుకొని సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. అదేవిధంగా ముంబయికి చెందిన ఓ తల్లి కూడా తన కుమారుడి సంతోషం కోసం ఓ పెళ్లికొడుకుని వెతుకుతోంది. ఈ మేరకు మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో యాడ్ కూడా ఇచ్చింది. ముంబయికి చెందిన పద్మ అనే మహిళ తన కుమారుడు హరీష్ అయ్యర్(36) వివాహం చేయాలనుకుంది. కానీ అతను స్వలింగ సంపర్కుడు కావడంతో.. గే భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. తాను ముసలిదాన్ని అయిపోయానని, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేలోపు తన కుమారుడికి మంచి అబ్బాయి జీవిత భాగస్వామిగా వస్తే బాగుండునని పద్మ అంటున్నారు. తన కుమారుడి కోసం పద్మ ఇచ్చిన యాడ్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఆ యాడ్ చూసి చాలా మంది స్పందిస్తున్నారంట. తన కుమారుడికి మంచి భాగస్వామి దొరికే అవకాశాలున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.