షక్‌స్పియర్ అసలు రూపం... ఇదే

Posted On:20-05-2015
No.Of Views:318

హైదరాబాద్: ఆయన రచనలు అద్భుతం. విలక్షణమైన నాటకాలను రచించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే ఆంగ్ల నాటక రచయితల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన విలియం షేక్‌స్పియర్. 16వ శతాబ్దానికి చెందిన ఈయన చిత్రపటాన్ని లండన్‌లోని ప్రముఖ పత్రిక కంట్రీలైఫ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రచురితమైన షేక్‌స్పియర్ చిత్రపటాలన్నీ అధికారికమైనవిగా గుర్తింపు పొందలేదు. అయితే కంట్రీలైఫ్ విడుదల చేసిన ఈ చిత్రపటం అధికారికమైనదని మ్యాగజైన్ ప్రతినిధులు తెలిపారు. 400ఏళ్ల క్రితం జాన్ గెరార్డ్ రచించిన 'ది హెర్బల్' అనే పుస్తకం ముఖపత్రంపై షేక్‌స్పియర్ జీవించి ఉండగా గీసిన చిత్రపటం ఉంది. కంట్రీలైఫ్ పత్రికకు చెందిన మార్క్ గ్రిఫిత్ ఈ పుస్తకాన్ని కనుగొని షేక్‌స్పియర్ ఒరిజినల్ చిత్రపటాన్ని వెలుగులోకి తెచ్చారు.