హై హీల్స్ వివాదం పట్ల క్షమాపణలు కోరిన కేన్స్ నిర్వాహకులు

Posted On:20-05-2015
No.Of Views:253

 హైదరాబాద్: కేన్స్‌లో హై హీల్స్ వివాదంపై కేన్స్ చిత్రోత్సవ కార్యక్రమం డైరెక్టర్ క్షమాపణలు కోరారు. కార్ల్‌టన్ హోటల్ నిర్వహించిన ఓ విందులో డైరెక్టర్ థైరీ ఫ్రీమౌక్స్ ఈ వివాదంపై క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. హై హీల్స్ వేసుకోవాలని నిబంధనేమీ లేదని వెల్లడించారు. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగుతున్న 68వ కేన్స్ చిత్రోత్సవంలో హై హీల్స్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. చిత్రోత్సవానికి హాజరైన కొందరు మహిళా ప్రముఖులు హైహీల్స్ వేసుకోలేదని రెడ్ కార్పెట్‌పైకి భద్రత సిబ్బంది అనుమతించకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం వివాదాస్పదమైంది. దీంతో ఈ అంశంపై వార్తల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో కేన్స్ నిర్వహకులు వివాదాన్ని సద్దుమణిగించే పనిలో పడ్డారు.