స్వచ్ఛహైదరాబాద్ నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది: కేసీఆర్

Posted On:20-05-2015
No.Of Views:268

హైదరాబాద్: హైదరాబాద్ నగరం బాగుపడేవరకు విశ్రమించేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్వచ్ఛహైదరాబాద్‌లో భాగంగా ఎల్బీనగర్ పరిధిలో ఎన్టీఆర్ నగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ చెత్తపై సమరం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బస్తీవాసులకు సూచించారు. నగరంలో ఒక్క బస్తీ కూడా పరిశుభ్రంగా లేదని.. నగరం ఉండాల్సినంత అందంగా లేదన్నారు. స్వచ్ఛహైదరాబాద్ నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. చెత్త సేకరించి పారబోయడానికి ఆటో ట్రాలీలను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ నామాలగుండులో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రజలు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.