గడ్డపారతో పొడిచి తమ్ముడిని చంపిన అన్న

Posted On:20-05-2015
No.Of Views:279

తలకొండపల్లి: మహబూబ్‌నగర్ జిల్లా తల కొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో మద్యం మత్తులో అన్న సొంత తమ్ముడిని గడ్డపారతో పొడిచి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన ఒద్దె నడిపి జంగయ్య తన తమ్ముడు చిన్న జంగయ్య(35) ఇంటికి మద్యం మత్తులో వెళ్లి ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అన్న నడిపి జంగయ్య అందరూ చూస్తుండగానే తమ్ముడిని గడ్డపారతో పొడిచి చంపేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా కోసం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు