ఆఫీస్ యాప్స్ ప్రీవ్యూ విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

Posted On:20-05-2015
No.Of Views:314

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం యాప్‌లను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోని వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ కోసం ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించింది. ఈ యాప్‌ల ద్వారా ఫైల్స్‌ను క్లౌడ్‌లో భద్రపరుచుకోవచ్చు. ప్రస్తుతం వీటి బీటా వర్షన్లు విడుదల చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. త్వరలోనే యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌లు 1జీబీ ర్యామ్ మెమోరీ ఉండి ఆండ్రాయిడ్ 4.4వర్షన్, దాని తర్వాత వర్షన్లలో మాత్రమే పనిచేస్తాయని తెలిపారు.