రోహిత్ కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్

Posted On:26-05-2015
No.Of Views:290

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్‌గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్‌లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్‌గా పాంటింగ్ దృక్పథాన్ని కూడా మాస్టర్ ప్రశంసించాడు.