చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు

Posted On:26-05-2015
No.Of Views:287

చీకటిరాజ్య చుంభనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. లిప్‌లాక్ దృశ్యాలు ఇప్పుడు సినిమా ల్లో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అలాంటి సన్నివేశాలను తప్పుపట్టే స్థాయి దాటిపోయింది. లిప్‌లాక్ దృశ్యాల్లో నటిస్తే తప్పేమిటి? అని ప్రశ్నించే హీరోయిన్ల శాతం పెరిగిపోతోంది. ఇంతకుముందు చుంభనాల దృశ్యాలకు తాను దూరం అన్న హీరోయిన్లు ఇప్పుడు కథ డిమాండ్ చేయడంతో కాదనలేకపోయానని అయినా ఆ సన్నివేశంలో అసభ్యం లేకుండా దర్శకుడు కళాత్మకంగా చిత్రీకరించారని చెబుతున్న కాలం ఇది.కోలీవుడ్‌లో అసలా ఇలాంటి లిప్‌లాక్ దృశ్యాలకు అగ్‌మార్క్ హీరో కమలహాసన్ అంటారు. ఆయన ప్రతి చిత్రంలోను ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఈ విశ్వనాయకుడి చుంభనాల దృశ్యాలు చాలా ఘాటుగా ఉంటాయని అంటారు. తన తాజా ద్విభాషా చిత్రం చీకటి రాజ్యం తమిళంలో తూంగావనం ఇలాంటి చుంభనాల దృశ్యాల మోతాదు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాదులో నిర్వహించారు.ఈ సందర్భంగా విడుదల చేసిన కమలహాసన్ నటి త్రిషను ఘాటుగా చుంభించే పోస్టర్ యువతను విపరీతంగా ఆకర్షిస్తు సంచలనం కలిగిస్తోంది. సాధారణంగా కమల్ చిత్రాలు వివాదాలకు నిలయం అనే పేరుంది. ఇటీవల ఆయన నటించిన ప్రతి చిత్రం తీవ్ర వ్యతిరేకతల మధ్య విడుదలైంది. ఈ తాజా చిత్రంలో చుంభనాల దృశ్యం ఎలాంటి వివాదాలకు తావు తీయనున్నాయో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.