టిడిపి మహానాడు.. ప్రాంగణానికి చేరుకున్న హరికృష్ణ, లోకేష్

Posted On:26-05-2015
No.Of Views:281

పార్టీ మూడు రోజుల మహానాడు బుధవారంనాడు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. యేటా టిడిపి మహానాడు ఇవే తేదీల్లో జరుగుతాయి. వేదికపై తెలంగాణకు చెందిన కాకతీయ స్తూపం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలను ఉంచారు. బుధవారం ఉదయం మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహానాడులోని చంద్రబాబును టిడిపి జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటిస్తూ ఈ మాహానాడులో తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఎపికి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి పది తీర్మానాలను మాహానాడులో చేరుస్తారు.