మహేష్ ట్వీట్ చేసాడు...

Posted On:26-05-2015
No.Of Views:309

మహేష్ బాబు ట్విట్టర్ ని చాలా అరుదుగా వాడుతూంటారు. ఆయన ఒక ట్వీట్ చేసారంటే అందరి దృష్టీ ఆ విషయంపై మళ్లుతుంది. అలా ఇప్పుడు ఆయన తాజాగా ఓ ట్వీట్ చేసాడు. విజయనిర్మల కుమారుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న ఐనా ఇష్టం నువ్వు చిత్రం గురించి ఎవరూ ఊహించని విధంగా మహేష్ ట్వీటాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా , ఇన్నోవేటివ్ గా ఉందంటూ మెచ్చుకున్నాడు. నవీన్ కు, యీనిట్ మెంబర్స్ కు శుభాకాంక్షలు తెలియచేసాడు. ఆ ట్వీట్ ఈ క్రింద విధంగా సాగింది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు   చిత్రం విషయానికి వస్తే... సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. రాంప్రసాద్ రగుతు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఐనా ఇష్టం నువ్వు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణ మాట్లాడుతూ... మా కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరాన్ని ఆదరించారు. తరువాత రెండవ తరంలో వచ్చిన నరేష్, మహేష్, మంజులను అభిమానించారు. ఇప్పుడు మూడవ తరంలో ముందుగా నవీన్ విజయకృష్ణ హీరోగా వస్తున్నాడు. తనని కూడా ప్రేక్షకులు ఆదరించాలి. నవీన్‌కు సూపర్‌స్టార్ ఇమేజ్ రావాలి అన్నారు. నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమాకు చాలా టైటిల్స్ పరిశీలించాం. అయితే కృష్ణవంశీ రూపొందించిన ఖడ్గం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఓ పాటలోని చరణాల్ని తీసుకుని ఐనా ఇష్టం నువ్వు టైటిల్‌ని ఖరారు చేయడం జరిగింది. నన్ను సపోర్ట్ చేస్తున్న తాతయ్య, నానమ్మలకు, నాన్నకు కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత చంటి మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌ జరుగుతోంది. వచ్చే నెల మొదట్లో పాటల్నీ, మూడు లేదా నాలుగో వారంలో చిత్రాన్నీ విడుదల చేయాలని సంకల్పించాం'' అన్నారు టైటిల్‌లోనే కథ ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తోందనీ, చంటి ద్వారా హీరోగా నవీన్‌ పరిచయమవుతుండటం సంతోషంగా ఉందనీ విజయనిర్మల చెప్పారు.సీనియర్‌ నరేశ్‌ కుమారుడు నవీన్‌ విజయకృష్ణ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రానికి ‘ఐనా ఇష్టం నువ్వు' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఫ్రెండ్లీ మూవీస్‌ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంప్రసాద్‌ రగుతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేశ్‌, చాందిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.