టీడీపీ నేత ఇంట్లోనే దొరికిన ‘దక్షిణామూర్తి’ విగ్రహం

Posted On:29-05-2015
No.Of Views:268

వెంకటగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోరీకి గురైన శ్రీమేధ దక్షిణామూర్తి విగ్రహం చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన టీడీపీ నేత, సింగిల్ విండ్ వైస్‌చైర్మన్ మర్యాద చంద్ర అలియాస్ చంద్రశేఖర్‌నాయుడు ఇంట్లో ఈనెల 22న లభించినట్లు సమాచారం. చోరీ కేసులో చంద్రశేఖర్‌నాయుడు కుమారుడు శ్రీకాంత్‌నాయుడుని నిందితుడిగా గుర్తించిన గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.తొలుత చంద్రశేఖర్‌ నాయుడు, ఆయన సతీమణి శాంతమ్మను విచారించి వారి ఇంటిలో దాచి ఉంచిన విగ్రహంను పక్కా ప్రణాళికతో ఎస్సై వీరేంద్రబాబు సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకుని గుంటూరు ఐజీ కార్యాలయానికి తరలించారు. రెండు రోజుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.