పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కొత్త పథకాలు: వెంకయ్య

Posted On:29-05-2015
No.Of Views:243

హైదరాబాద్: ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తక్షణ పరిష్కారంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఏడాది పాలన సంతృప్తి కరంగా సాగిందని... మోదీ నేతృత్వంలో దేశానికి మంచి నాయకత్వం లభించిందన్నారు. నగర భారతాన్ని పేదల పక్షంగా మార్చేందుకు మోదీ దృష్టిసారించారన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 2020 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని వెంకయ్యనాయుడు ప్రకటించారు.