తల్లిదండ్రులను చంపిన మాజీ మోడల్‌కి జీవితఖైదు

Posted On:29-05-2015
No.Of Views:259

 హైదరాబాద్: తల్లిదండ్రులను చంపిన కేసులో మాజీ మోడల్‌కి కోర్టు జీవితఖైదు విధించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌కి చెందిన ప్రేమ్‌వీర్‌సింగ్ జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆయన కుమార్తె, మాజీ మోడల్ ప్రియాంక సింగ్. ఆస్తి పంపకాల విషయంలో తన తల్లిదండ్రులు ఇద్దరూ తరచూ గొడవపడుతూ తనను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన ప్రియాంక 2008 నవంబర్11న తన స్నేహితురాలు అంజు సహాయంతో తండ్రి ప్రేమ్‌వీర్‌సింగ్(65), తల్లి సంతోష్‌సింగ్(62)లను చంపేసింది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో హత్యానేరాన్ని అంగీకరించిన వీరికి గురువారం కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.20వేలు జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.