టీఎస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన శారద

Posted On:29-05-2015
No.Of Views:244

హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు సమున్నత గౌరవం దక్కుతుందని ఆపార్టీ సీనియర్‌నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో గాంధీభవన్‌లో కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు వాయిలార్ రవి, రామచంద్ర కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్‌లో మహిళలకు ఏ ఒక్కపార్టీ కూడా సీటు ఇవ్వలేదని, ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఆకుల లలితకు అవకాశం ఇచ్చిందని ఈ సందర్భంగా గులాంనబీ ఆజాద్ అన్నారు.