చిన్నారి ఏడుపు భరించలేక.. గాయనిని విమానం నుంచే దించేశారు

Posted On:29-05-2015
No.Of Views:267

 కెనెడియన్ గాయని సారా బ్లాక్‌వుడ్‌(34)ని తన రెండేళ్ల కుమారుడు విపరీతంగా ఏడుస్తున్నందుకు విమానం నుంచి దించేశారు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది. ఈ ఘటన బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. బాలుడు చాలా సేపటి వరకు ఏడుపు ఆపకపోవడంతో విసుగుచెందిన సిబ్బంది విమానం నుంచి దించేసినట్లు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన కుమారుడి ఏడుపు ఆపేందుకు తాను చాలా ప్రయత్నం చేశానని తెలిపారు. పిల్లాడ్ని నిశ్శబ్ధంగా ఉంచాలని విమాన సిబ్బంది ఆమెను కోరారు. అయితే ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పిల్లాడు ఏడుపును ఎంతమాత్రం ఆపలేదు. దీంతో విమాన సిబ్బంది ఏడు నెలల గర్భవతి కూడా అయిన ఆమెను విమానం నుంచి దించేశారు. కాగా, విమాన సిబ్బంది తీరుపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బంది అతిగా ప్రవర్తించారని ఆరోపించారు.