రెస్టారెంట్‌కు ఆనందమైన షాకిచ్చాడు: $93 బిల్లుకు $2,000 టిప్

Posted On:29-05-2015
No.Of Views:273

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి బార్ స్టాఫ్‌కు షాకిచ్చాడు! వాషింగ్టన్‌కు చెందిన అతను నెయిబర్ హుడ్ రెస్టారెంటుకు తన స్నేహితుడితో కలిసి వెళ్లి 2000 డాలర్లు వదిలేసి వచ్చాడు! బిల్లు అయిన దానికంటే ఇరవై రెట్లు అతను స్టాఫ్‌కు టిప్‌గా వదిలేసి వచ్చాడు. ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సోమవారం నాడు రాత్రి పూట రెస్టారెంటుకు వచ్చాడు. అతను భోజనం, ఇతర డ్రింక్స్ తీసుకున్నారు. అతను, స్నేహితుడి తిన్నది అంతా కలిపి బిల్లు 93 డాలర్లు అయింది. అయితే, అతను మొత్తం 2093 డాలర్లు బిల్లు ఇచ్చి వెళ్లాడు. అతను బిల్లు పైన థ్యాంక్యూ అంటూ కూడా రాశాడు. దీనిపై రెస్టారెంటుకు చెందిన వారు మాట్లాడుతూ.. ఇది ఆనందకరమైన ఆశ్చర్యకరమని చెప్పాడు. క్రిస్ నార్దెల్లి అనే చెఫ్ నాలుగేళ్లుగా రెస్టారెంటులో పని చేస్తున్నాడు. అతను దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా, ఆ కస్టమర్ ఎవరు అనేది తెలియరాలేదని చెబుతున్నారు.