పోలీసుల అదుపులో 74మంది ఎర్రచందనం కూలీలు

Posted On:29-05-2015
No.Of Views:268

హైదరాబాద్: కడప జిల్లా చిన్నమండెం వద్ద తమిళనాడుకు చెందిన 74 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీలు చిత్తూరు జిల్లా నుంచి రాయచోటికి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీలను చిన్నమండెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రూ.20లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం: కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేటలో 35 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న దంగులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.20లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.