స్మార్ట్‌ఫోన్ కోసం...

Posted On:29-05-2015
No.Of Views:335

హైదరాబాద్: యువతలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై క్రేజ్ ఎంతగా మారిందంటే.. వాటిని కొనుక్కోవడం కోసం ప్రాణాలు వదులుకునేవారు కొందరైతే మరి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 13ఏళ్ల బాలిక స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవడం కోసం వేశ్యగా మారిందంటే వాటి ప్రభావం యువతలో ఎంతగా ఉందో అర్థమవుతుంది. గుజరాత్‌కు చెందిన 13ఏళ్ల బాలిక ఏడాది క్రితం స్మార్ట్‌ఫోను కొనుక్కోవాలనుకుంది.తన స్నేహితులు వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి తనకు అలాంటివి కావాలని తన తల్లిని అడిగింది. తనకు కావాల్సినంత డబ్బులు లేకపోవడంతో ఏడాది నుంచి వేశ్య వృత్తిని చేపట్టింది. దాంతో వచ్చే డబ్బులతో తన సరదాలను తీర్చుకోవడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన బాలిక తల్లి ఆమెను అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేదు. చివరకు బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో విషయం తెలిసిపోయింది. దీంతో బాలికకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.