జపాన్‌లో పేలిన అగ్నిపర్వతం.. నివాసాలు ఖాళీ చేసిన ప్రజలు

Posted On:29-05-2015
No.Of Views:270

జపాన్‌లోని కుచినోరబు ద్వీపంలో ఈ రోజు ఉదయం ఓ అగ్నిపర్వతం పేలింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా, బూడిద ఎగసి పడుతున్నాయి. దీంతో దాని చుట్టుపక్కల నివాసముంటున్న దాదాపు 120 కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. జపాన్ వాతావరణ శాఖ ఆ ద్వీపంలో ఉంటున్న వారందరినీ ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సూచించింది. పరిస్థితులు అదుపులోకొచ్చాక తిరిగి రావచ్చునని తెలిపింది. ఈ విషయమై జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడారు. పరిసర ప్రాంతాల ప్రజల బాధ్యత తాము తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.