ధర్మేంద్రకు అనారోగ్యం..హాస్పటిల్ లో

Posted On:29-05-2015
No.Of Views:251

 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తీవ్రమైన భుజం నొప్పి, నిస్సత్తువతో ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ''ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాటి ఫలితాలు వచ్చాక అవసరమైన చికిత్స అందిస్తాము''అని వారు చెప్పారు. ధర్మేంద్ర వైద్య పరిస్థితిపై మాట్లాడేందుకు ఆసుపత్రి అధికారులు నిరాకరించారని తెలియగా, మరోవైపు రొటీన్ చెకప్ లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ మధ్యన తండ్రీ కొడుకులు ధర్మేంద్ర, సన్నీడియోల్‌, బాబీడియోల్‌ కలిసి ఇటీవల నటించిన చిత్రం 'యమ్లా పాగ్లా దీవానా'. సమీర్‌ కార్నిక్‌ దర్శకుడాగా పరిచయమవుతూ రూపొందిన ఈ చిత్రం హాస్యతరహా కథాంశంతో తెరకెక్కి విజయం సాధించింది.