పెళ్లికి ముందే సెక్స్ అంటోన్న కాజోల్ చెల్లెలు

Posted On:29-05-2015
No.Of Views:314


బాలీవుడ్ నటి తానిసా ముఖర్జీ(ప్రముఖ నటి కాజోల్ చెల్లెలు) పెళ్లికి ముందే సెక్స్‌‌కు తన మద్దతు ప్రకటించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్లో జరిగిన చర్చలో ఆమె ఈ మేరకు స్పందించారు. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం తప్పేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నడుకోవచ్చంటూ తానిషా ముఖర్జీ కామెంట్ చేసారు. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్...ఉదయ్ చోప్రా, అర్మాన్ కోహ్లి గురించి అడగ్గా ఇపుడు వారితో ఇపుడు స్నేహం చేయడం లేదని తెలిపింది. బాలీవుడ్ నటుల్లో సిద్ధార్థ్ మల్హోత్రా చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఇక తానిషా ముఖర్జీ సినిమాల విషయానికొస్తే.... 2003లో ‘ష్..' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన తానిషా ముఖర్జీ నటిగా నిలదొక్కుకోలేక పోయింది. పెద్దగా అవకాశాలు, తాను కోరుకున్న విధంగా పాత్రలు రాక పోవడంతో 2011లోనే సినిమాలకు పులిస్టాప్ పెట్టేసింది. 2013లో బిగ్ బాస్ 7 టీవీ రియాల్టీ షోలో పాల్గొనడంతో పాటు, 2014లో గ్యాంగ్స్ ఆఫ్ హాసీపూర్ అనే టీవీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించింది.